ట్విట్టరిల్లు

రాయి అన్నడు మల్లన్న. లాక్ డౌన్ పెట్టినంక మొదటి సారి ఫోన్ చేసినప్పుడు.
కథ రాయమని ఇప్పటి వరకు అడిగింది ఈయనొక్కడే.
అయితే "ఆఫీసోల్లు వర్క్ ఫ్రం హోం ఇచ్చారన్నా, రోజంతా పనే" అని చెప్పిన. పచ్చి అబద్ధం అది. పేరుకి వర్క్ ఫ్రం హోం అయినా ప్రాజెక్ట్ ఎసైన్ కాలెదు. రోజంత పెద్ద పనేం ఉండదు.
ఏం రాయాలా అని ఆలోచిస్తే ఏం తట్టలే. ట్విట్టర్ లో చాలా సమయం గడుపుతాం కదా,దాని గురించే రాద్దాం అనిపించింది.

ట్విట్టర్ అంతా గొడవలమయం. చాలా మంది ఇంటెల్ ఎచ్చువల్సు ఉంటారందులో.ఫ్యాన్ వార్సు, పనికి రాని ట్రెండ్సు, ట్రోల్స్ అబ్బో గోల మామూలుగా ఉండదు. వారి వారి హీరోలను, పొలిటికల్ లీడర్సును చాలా భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. హీరోలని,హీరోయిన్సుని ట్యాగ్ చేసి తిట్టడం, పొలిటికల్ గా ఘాటైన విమర్శలు చేసుకోవడం, ఇవంతా చూస్తే ఒపీనియన్స్ని రుద్దేస్తున్నట్లు కనిపిస్తుంది.

అయితే ట్విట్టర్ కి పాజిటివ్స్ లేకపోలేదు. ఇంత గజిబిజి స్పేస్లో
కొంతమంది నిజమైన ఇంటెలెక్చువల్స్ కూడా ఉంటారు.చాలా టాలెంటెడ్ వారుంటారు.వివిధ విషయాలపై భిన్న వాదనలు తెలుస్తాయి. మనకున్న ప్రిజుడైస్ లని పటాపంచల వుతాయి ఒక్కో సారి. యే వార్తయినా ముందు ట్విట్టర్ ప్రపంచానికే తెలుస్తది. సెలబ్రిటీల అప్డేట్స్ ముందుగా తెలుస్తాయి.పోలీస్ కంప్లైంట్స్ కాన్నుంచి, పొలిటీషియన్స్ పని తీరులపై విమర్శలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ (డిప్లొమసీ నిజానికి ట్విట్టర్ లో నడవదు, అయినప్పటికీ) ఇలాంటివి చాలా తెలుస్తాయి.

అక్కడో ఎక్కడో తెలుగు బాషాభిమానులూ ఉంటారు. వారి ముచ్చట్లు,కథలు పంచుకుంటూ ఉంటారు. అలాగే సినిమా కూడా. భాషతో సంబంధం లేదు, మంచి సినిమా,లేదా సిరీస్ ఏదైనా వుందంటే జనాలకి ఇట్టే తెలిసిపోతుంది.

సినిమనో,సాహిత్యమో,లేదా మరేదైనా కామన్ ఇంటరెస్ట్ వల్ల ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. సరదాగా రిప్లైలు బయట కలుస్తూ ఉంటారు కూడా.(అబ్బాయిలు,అమ్మాయిలు
పెద్దగా కలవరు లెండి, అది టిండరు, ఇది ట్విట్టరు ! ).

ఎంత గోల ఉన్నా సరే, మనకొక మనిషిని పరిచయం చేసిందంటే అంత కన్నా కావలిసింది ఏముంది !!!

(To  Be Contd..)

Comments

  1. హో ఆ ఇల్లుతోనే మాకు పరిచయం అయ్యారు.
    ఒకసారి మన ఇల్లు కూడా చూడండి... ధన్యవాదాలు.
    http://sskchaithanya.blogspot.com

    ReplyDelete

Post a comment