తెలుగు సీ'రియల్లు'

అన్ని తెలుగు సీరియల్లు ఇవివి గారి'ఆయనికి ఇద్దరు' దగ్గరే ఆగిపోయాయి.ఏమీ తెలియని ఓ అమాయక చెల్లెలు,అతి తెలివి తేటలు కలిగిన ఓ అక్క.వీళ్ళు లేని తెలుగు సీరియల్ దాదాపు మనకు కనపడవు.(అన్నీ అని చెప్పి 'అమృతం'లాంటి వాటిని విమర్శించలేను.)అందరికీ తెలుసు చెల్లే గెలుస్తుందని.అయినా మనం చూస్తూనే ఉంటాం.వాడు ఆ సీరియల్ని  లాగి లాగి సాగదీసి ఓ వెయ్యి ఎపిసోడ్లు తీసి అవతల పాడేస్తాడు.ఈ లోపులో చెల్లి లీటర్లు లీటర్లు కన్నీరు కార్చేస్తుంది.తాను ఏడవటమే కాకుండా తెలుగు స్త్రీలందరిని శోకసంద్రంలో ముంచేస్తుంది.ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్(నేపధ్య సంగీతం)గురించైతే చెప్పే పనే లేదు.ఎంత పెద్ద సినిమా మ్యూజిక్ నైనా ఇందులో నిర్మొహమాటంగా కలిపేస్తారు.నేనిప్పుడు తెలుగు సీరియల్స్ 'గేమ్ అఫ్ త్రోన్స్'  రేంజ్ లో  భారీగా వుండాలనట్లేదు.కాకపోతే ఎన్నో ఏళ్ల నుంచి ఆచరిస్తున్న మూస ధోరణిని మార్చుకోవాలి.సీరియల్లు సామాన్యుడి వత్తిడిని మర్చిపోయేలా చేయాలి.కొత్త వత్తిడిని తెచ్చిపెట్టకూడదు.ఎపిసోడ్ ఎపిసోడ్కి ఆసక్తిని రేకెత్తించాలి ,వత్తిడిని కాదు.అలా చేయకపోతే జనాలు గతిలేక కామెడీ పేరుతో చెలాయిస్తున్న కొన్ని "బూతు షో"లనే చూడాల్సి వస్తుందనేదే నా బాధ.(ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి ,దీని గురించి తర్వాత మాట్లాడదాం)!.

Comments

Popular Posts