కోతికొమ్మచ్చి
భారతదేశ ప్రజాస్వామ్య చెట్టుపై ఒక మనిషి, ఒక కోతి 'కోతికొమ్మచ్చి'లాడుతున్నాయి. రోజు రోజుకి కొమ్మలు మారుస్తున్నాయి.కొమ్మలెన్ని విరుగుతున్నా,ఆకులన్ని రాలుతున్నా ఏ మాత్రం 'లెక్క'చేయట్లేదు. అందని మావిడికై అందరినీ నోరూరిస్తూ రోజుకో వెర్రి సూత్రపాశాలు విసురుతున్నాయి.మనిషి కోతినాడిస్తుంటే,ఆ కోతి కోట్ల మందిని ఆడిస్తుంది.ఆ కోతేవరో,మనిషెవరో మీకిప్పటికే అర్ధమయుంటుంది.(మనిషి కోతి కంటే ఏ మాత్రం తక్కువ 'తినలేదు').
ఇక్కడ కేంధ్రాన్ని మనిషితో, 'RBI'ని కేవలం కోతితో పోల్చినందుకు క్షమించాలి.(రెండింటికి దగ్గర చుట్టం వుందిగనుక అలా పోల్చవలసి వచ్చింది.) మొదట బ్యాంకుల్లోంచి నాలుగువేలే తీయాలంది.తరువాత ఆ పరిమితిని నాలుగువేల అయిదు వందలకి పెంచింది.A.T.M ల నుంచి రెండువేలే తీయాలంది.తరువాత ఆ పరిమితిని రెండువేల అయిదు వందలకి పెంచింది.(నాకు తెలిసి ఉర్జిత్ గారికంటే మా ఎకనామిక్స్ మాష్టారే నయ్యo.అసలు సగానికి పైగా A.T.M లు తెరుచుకోనే లేదు.ఆ మిగతా A.T.M లలో చాలవాటిని రెండు వేల నోట్లతోనే నింపారు.రెండు రెండువేల నోట్ల నుంచి రెండు వేల అయిదు వందలెలా వస్తాయో పటేల్ గారికే తెలియాలి.)ముందు బ్యాంకుల్లో వారానికి ఇరవై వేలే తీయాలంది. ఆ తరువాత కాదు కాదు ఇరవై నాలుగు వేలంది.నిన్నగాక మొన్న బ్యాంకుల్లో అయిదు వేలకి మించి వేయరాదంటూ ఏదో పిచ్చి కూతలు కూసింది.మొన్నగాక నిన్న దాన్ని మార్చేసింది.మళ్లీ ఈ రోజు సర్ ఛార్జిలంటూ ఇంకేదో వాగుతుంది.వీళ్ల రాజకీయాలు 'ఛీ' అనేంత ఛీపుగా 'తు' అనేంత తుప్పు పట్టి వున్నాయి.వీళ్ల వేషాలకిక అంతెప్పుడో...
Comments
Post a Comment