Say talak to talak



"తలాక్ తలాక్ తలాక్"
ఇప్పుడు జాతీయంగా చర్చనీయాంశంగా మారిన విషయమిది.
ఇంత అకస్మాత్తుగా ఈ "ట్రిపుల్ తలాక్" వెలుగులోకి రావడానికి కారణం లేకపోలేదు.ఉత్తరప్రదేశ్ కు చెందిన "షాగుప్తా షా" ఈ ట్రిపుల్ తలాక్ విషయమై బుధవారం U.P సి.ఎం యోగి ఆదిథ్యానంద్ కు,ప్రధాని మోడీకి ఉత్తరం రాసింది.అబార్షన్ చేయయించుకోవడానికి నిరాకరించినందుకు,ఇద్దరు పిల్లల తల్లి, చూలాలని కూడా చూడకుండా "ట్రిపుల్ తలాక్" చెప్పి బయటకు గెంటేసాడామె భర్త. ఈ విషయం కాస్తా జాతీయ మీడియాకి అందటంతో దుమారం చెలరేగింది.

'స్త్రీ,వివాహం,విడాకులు'...,

"వివాహం కోసం స్త్రీ భర్తను అంగీకరిస్తుంది.స్త్రీ కోసం పురుషుడు వివాహాన్ని అంగీకరిస్తాడు."
                         -చివరికి మిగిలేది లో బుచ్చిబాబు

 వివాహం లేకుండా స్త్రీని ప్రశాంతంగా బ్రతకనీయదీ సంఘం.
"ఒక సాధారణ పురుషుడు రమారమి 35 దాటాక కూడా వివాహం చేసుకోవచ్చు. సంఘానికి ఏ ఇబ్బందీ ఉండదు.అదే వయసున్న ఒక స్త్రీ చేసుకోవాలంటే " ఒక అందమైన యువతికి వరుడు కావలెను.,కట్నం కోటి,కులప్రసక్తి లేదు.." ఈ విధంగా ఈనాడులో యాడ్ ఇవ్వవలిసిందే.(కష్టమని తాత్పర్యం)"

 స్త్రీ జీవితంలో వివాహం అనేది అతి ముఖ్య ఘట్టం.అది తల్లి తండ్రుల చేతుల్లో వుంటుంది.వివాహం తరువాత పిల్లలు..అది భర్త చేతుల్లో ఉంటుంది.చివరికి విడాకులయినా స్త్రీ అంగీకారంతో జరుగుతాయా అంటే.,అస్సలు జరగవు.విడాకులకి అంగీకరించకుంటే భర్త నుంచి,అత్త మామల నుంచి వేదింపులు తప్పవు.
విడాకులనేవి పరస్పర అంగీకారంతో జరగాలి.రాముడు సీతకి విడాకులిచ్చాడులే కానీ సీత రాముడికి ఇవ్వలేదు.ఇక్కడ సీత అభిప్రాయం ఎవరికీ అనవసరం.స్త్రీలు ఈ విడాకుల విషయంలో ఎప్పటి నుంచో వివక్షని ఎదుర్కొంటున్నారు. అంతెందుకు,ఇప్పటికీ కొన్ని పల్లెటూరు పంచాయితీల్లో స్త్రీలకి వ్యతిరేకంగా విడాకులిచ్చేస్తూ ఉంటారు మనపెద్దలు.(బ్రతుకు జట్కా బండి చూడండి). స్త్రీ స్వేచ్ఛ వంటలోకి ఏ కూర వుండాలో నిర్ణయిస్తుందిలే కానీ విడాకుల వంటి విషయాల దాకా రాదు.(రానివ్వరు)

ఇటువంటి దురాచారాలు మనకు కొత్తేం కాదు.మనం ఇంతకంటే దౌర్భాగ్యమయిన సతీసహగమనాన్ని చూసాం.
సంఘ సంస్కర్తల పుణ్యమా అని ఏ గవర్నమెంట్ సహాయం లేకుండానే అది తుడిచిపెట్టుకు పోయింది.అయితే ఇంత కాలమైనా, మన సెక్యులర్ గవర్నమెంట్ విడాకుల విషయంలో దేశమంతటికీ ఒకే చట్టం తేకపోవటం దురదృష్టకరం.

"ట్రిపుల్ తలాక్ ను తప్పని చెప్పడం ఖురాన్ ను మళ్లీ రాయడమంత పాపమవుతుందని వాపోతున్మారు.
కొందరు ముస్లిం మతపెద్దలు..వారి "ఉనికిపాట్లు" వారివి.'తలాక్' కి 'తలాక్' చెప్పే సమయం దగ్గరికొచ్చింది.
ఈ విషయమై మార్చ్ 11 న సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది.ఇది వారి నోరు మూయించాలని కోరుకుందాం..



                మీడియాతో "షాగుప్తా షా"



ట్విట్టర్ లో ట్రెండవుతున్న "ట్రిపుల్ తలాక్".

"Please try to raise your voice against Triple Talak .not asking in action's ,at least in Social Media."

Comments