As Jio gonna end, thing you should do right away

పుక్కెముగొచ్చిన ఫినాయిలున్ వదలకుమన్నారు పెద్దలు"..
జియో ఫ్రీ ఆఫర్ అయిపోవడానికి ఇంకా కొన్ని రోజులే  వుంది.ఇన్ని రోజులు ఏమనిపించలేదులే కానీ ఇప్పుడు నెలకి అంత కట్టాలి  ఇంత కట్టాలి అంటే మాత్రం జనాల చేతిల్లో సిమ్ ఆగేలా లేదు.ఈ నాలుగు రోజుల్లో మనం చేయవలసిన ముఖ్య కర్తవ్యం...జియోని వీలైనంత వాడెయ్యడం.అదే పని చేద్దామని  జియో సినిమా యాప్ తెరవగా బాజీరావు మస్తానీ తెలుగు అనువాదం కనపడింది.సినిమా ఆణిముత్యానికి అరో పావో ఎక్కువే కాని తక్కువగా లేదు.బాహుబలికి ఏ మాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు.సినిమాలో బాహుబలియన్ ఫైట్లు, గ్రాఫిక్స్ లేవులే కానీ ఆద్యంతం కట్టిపడేసే డ్రామా వుంది. కాస్ట్యూమ్స్, సెట్టింగులు సినిమాకే ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఇక నటన పరంగా అందరూ బ్రహ్మాడంగా చేశారు.డబ్బింగ్ కూడా చాలా సహజంగా వుంది.హిందీ రాని వాళ్లు సబ్ టైటిల్స్ డౌన్లోడ్ చేసుకొని అవి సింక్ గాక ఇబ్బంది పడే బదులు తెలుగులో చూడటం చాలా ఉత్తమం.ఉత్తమ ప్రజాధారణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు పొందిందీ చిత్రం.వీలైనంత త్వరగా చూసెయ్యండి.ఇంకా కొన్ని  రోజులే..గుర్తుందిగా


Comments