Sigh Sigh Sigh'ayyare'
పదకొండు గంటల సమయానికి నాలుగు బైకులతో కొంపల్లి కాడ స్టార్ట్ అయ్యేటోళ్లం.
50 కంటే పెట్రోల్ ఉండదు కదా 🙈, బోయినపల్లి కాడ పెట్రోల్ కొట్టించేటోళ్లం.
ఈ మధ్యలో పారడైస్ కాడ అందరం చాయ్.
ఆ తర్వాత ట్యాంక్ బండ కాడ ఆగి, ఏదో కాంపిటీషన్ అన్నట్లు, "నన్ను అట్ల తీయరా, ఇట్ల తీయరా" అనుకుంట ఒకడ్నొకడు సతాయించుకుంట ఫోటోలు దిగేటోళ్లం. (అందరికంటే మంచి కెమెరా ఫోన్ ఉన్నోడికి, తిప్పలే, మళ్లా షేర్ ఇట్ చేసేదాక వదలరు వాడ్ని). 12 దాటితే ట్యాంక్ బండ్ కాడ బాబాయ్ లు వస్తారు. ఇంక వెళ్లడం మంచిదనుకొని స్టార్ట్ అయ్యేటోళ్లం.
కరెక్ట్ గా పావుగంటకి ఖైరతాబాద్. అసలు మెయిన్ డెస్టినేషనే ఖైరతాబాద్. తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద వినాయకుడిని చూడటం కోసం. (అన్ని విగ్రహాలు ఒకటే. అన్నీ వినాయకుడివే. కానీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటే జనాలు బారులు తీరుతారు. ఇది మన స్వభావం. 😌)
జనం మామూలుగా ఉండరు.
బైక్ పార్కింగ్ కి అసలు ఖాలీ ఉండదు. ఈ లోపులో సెక్యూరిటీ గార్డ్ విజిల్స్ వేసుకుంటూ వచ్చి, "ఇక్కడ కాదు అటు పెట్టండి" అని హడావిడి చేసి వెళ్లిపోతాడు.
ఆ సందులో ఎక్కడో అక్కడ బైక్స్ తోసేసి అందరం దేవుడ్ని చూడటానికి కదిలేటోళ్లం. లోపలికి వెళ్లే కొద్దీ జనం వేళల్లో ఉంటారు. అందరు మాకులా వచ్చేటోళ్లే. జయింట్ వీల్స్ లేని జాతరలా ఉంటుందక్కడ కోలాహలం.
ఈ మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటది. మనం వెళ్లినప్పుడు గేట్ పడకపోతే లక్కి అనుకోవల్సిందే. అప్పటికి 12 దాటతా ఉంటది.
ఆ గేట్ దగ్గర ఇంకో వినాయకుడి మండపం ఉంటుంది. ఫస్ట్ అక్కడ దర్శనం. లక్ బావుంటే అక్కడ ప్రసాదం దొరుకొద్ది.😋
కొంచెం దూరం వెళ్ళాక క్యూ కనపడుతుంది. ఆ లైన్ లో వెళితే ఇంకొంచెం దగ్గరగా చూడొచ్చు. అంత ఓపిక ఉంటే మేము మేమెందుకు అవుతం 😏. అమ్మ బాబోయ్ అంత లైన్ మన వల్ల కాదని ఎంత కుదిరితే అంత దూరం వరకూ వెళ్ళేటోళ్లం.
చిన్న విగ్రహమా అది, 60 అడుగులు. ఒక 100 మీటర్ల దూరం నుంచి కూడా మంచిగ కనపడిద్ధి. అక్కడ చూసినంక, అక్కడ కూడా డిఫ్రెంట్ యాంగిల్స్ లో ఫొటోలు తీస్కొని మళ్ళీ బైక్స్ దగ్గరికి వస్తాం.
ఇది ఎందుకు ఫేమస్ అంటే లడ్డూ వేలం పాటకి. 10 లక్షల పైనే పోతుంది లడ్డూ.
అక్కడ చూసినంక లెక్క ప్రకారం వెనక్కి వచ్చేయాలి.
కానీ ఈ లోపులో ఎవడో ఒకడు స్టార్ట్ చేస్తడు "ఎహె, ఇప్పుడే పోయి ఏం చేస్తంరా, అట్ల తిరుగుదం అంటడు".
బాద్యతల్లేని స్వేచ్ఛ కదా ఆ రోజుల్లో. ఇంకేముంది హైదరాబాద్ మొత్తం తిరుగుదామని ఫిక్స్ అవడమే.
అప్పటికి ఒంటి గంట అవుతా ఉంటది. అట్లా
అందరం కోర్డినెట్ అవుకుంటూ జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, హైటెక్ సిటీ తిరిగే వాళ్లం. పాష్ ఏరియాలు అవి. అప్పటికే ఆ ఏరియాలు ఐడియా ఉన్నోడు "ఇది మోహన్ బాబు ఇల్లు, ఇది బాలకృష్ణది, ఇది ప్రభాస్ ది " అనుకుంట ఫిల్మ్ నగర్ మొత్తం చూపిస్తడు.
అయ్యంత చూసిన తరువాత రోడ్ సైడ్ దోశ కంపల్సరీ. 🤤ఇంక ఒకొక్కడు నిద్ర మొహం ఏసినంక రిటర్న్ స్టార్ట్ అవుతం.
మొత్తం తిరిగి హాస్టల్స్ దగ్గరికి వచ్చేసరికి తెల్లారి ఆరు అవుతా ఉంటది.
తెల్లారి సేలవుంటే సెట్టు. లంచ్ వరకు లేసేదే లేదు. క్లాస్ ఉంటే బంక్ కొట్టడమే. 😹
ఈ ఏడాది అంతా తలక్రిందులైంది. ఇన్స్టాగ్రామ్ లో, గూగుల్ ఫొటోస్ లో గత సంవత్సరపు మెమరీస్ అని నోటిఫికేషన్ వస్తుంది .
ఆ ఫొటోస్ చూస్కొని 'sigh' అనుకోవడమే. 😬
నిమర్జనం రోజు హడావిడి దీనికి డబుల్ ఉంటుంది.)
N
ReplyDeleteMissing those days 🥺
ReplyDelete🥺😞
Delete